HCU Admisions Started: హెచ్‌సీయూలో పీజీ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ షురూ
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీలో 2024–25 విద్యా సంవత్సరానికి 41 పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులలో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు.

ఈ వర్సిటీ దేశంలోనే టాప్‌టెన్ వర్సిటీలలో ఒకటిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. హెచ్‌సీయూలో దేశవ్యాప్తంగా ఉన్న వారందరికీ అవకాశం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది.
చదవండి: QS Quacquarelli Symonds: హెచ్‌సీయూకు ప్రపంచ స్థాయి గుర్తింపు
కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్–2024 స్కోర్ కార్డుల ఆధారంగా అడ్మిషన్లను కల్పించేందుకు విశ్వవిద్యాలయ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
వర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. వాటిని ఆన్‌లైన్ ద్వారానే పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 15 చివరి తేదీ. వివరాలకు వెబ్‌సైట్ http://acad.uohyd.ac.in సంప్రదించాలని హెచ్‌సీ యూ అధికారులు కోరుతున్నారు.
#Tags