Student AAPAR : విద్యార్థుల‌కు అందాల్సిన‌ అపార్ జ‌న‌రేష‌న్ వేగ‌వంతం చేయాలి

ప్రశాంతి నిలయం: ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆధార్‌ తరహాలో అపార్‌ ఐడీ జనరేషన్‌కు వివరాల నమోదును వేగవంతం చేయాలని కలెక్టర్‌ చేతన్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌తో కలసి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంఈఓలతో అపార్‌ విధివిధానాలపై కలెక్టర్‌ పలు ఆదేశాలు జారీ చేశారు.

Postpone of AP DSC : వాయిదాల‌తో ఏపీడీఎస్సీ నోటిఫికేష‌న్.. అభ్య‌ర్థుల ఆందోళ‌న‌!

వివరాలు సక్రమంగా ఉన్న విద్యార్థులకు సంబంధించి అపార్‌ జనరేషన్‌ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ కారణాల వల్ల రిజిస్ట్రేషన్‌ కాని వాటిని కేటగిరీల వారిగా విభజించి పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 1,67,082 మంది విద్యార్థులు ఉండగా, ఇందులో 1,49,770 మంది అపార్‌ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. మిగిలినవి పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

అనంతరం కలెక్టర్‌ ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో అర్డీఓ సువర్ణ, డీఈఓ క్రిష్టప్ప, డీఐఈఓ రఘునాథరెడ్డి, ఎంఈఓలు జయచంద్ర, ఆనంద్‌బాబు, సంపూర్ణ, డీపీఓ సమత, సచివాలయ నోడల్‌ అధికారి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Girl Students Unsafety : పాఠాలు చెప్పే టీచ‌ర్ల వ‌ద్ద కూడా విద్యార్థినుల‌కు త‌ప్ప‌ని వేధింపులు

#Tags