Postgraduate: 81 ఏళ్ల వయసులో పీజీ.. ఇప్పటికే.. !

సాక్షి, బళ్లారి: చదువుకు వయసుతో పనిలేదు. చదువుకోవాలనే కోరిక ఉంటే చాలు వయసుతో నిమిత్తం లేదు.
నింగయ్య బసయ్య

వృద్ధాప్యంలో ఉన్న కొందరు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. విజయపుర జిల్లా జేఎస్‌ఎస్‌ మహా విద్యాలయంలో 81 ఏళ్ల వయసులో నింగయ్య బసయ్య ఎంఏ ఇంగ్లిషులో పట్టా పొందారు. అదే విధంగా విశ్రాంత ఉపాధ్యాయుడు పరసప్ప ఇప్పటికే పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలు సాధించాడు. తాజాగా ఎంఏ ఇంగ్లిషు పరీక్షలు రాయడం విశేషం.

89 ఏళ్ల వయసులో 'పీహెచ్‌డీ'...ఎందుకంటే?

మనం ఏదోలా కష్టపడి చదివేసి ఒక మంచి ఉద్యోగం వస్తే చాలు అనుకుంటాం. పైగా చాలామంది కలెక్టర్‌ అనో లేక మంచి కంపెనీలో మంచి హోదాలో ఉండే ఉద్యోగి కావాలనో అనుకుంటారు.

 

కానీ కొంత వరకు ప్రయత్నించి ఈలోపు మధ్యలో ఏదైన చిన్న ఉద్యోగం వస్తే సెటిలైపోడానికే చూస్తాం. దీంతో మనం మన లక్ష్యాలను మధ్యలో వదిలేస్తాం. ఇంక మనం పెద్దవాళ్లమైపోయాం ఇంకేందుకు అనుకుంటాం. కానీ కొంత మంది మంచి ఉద్యోగం చేసి రిటైరైనప్పటికీ తమ లక్ష్యాన్ని, ఆసక్తిని వదులుకోరు.  అచ్చం అలానే యూఎస్‌కి చెందిన 89 ఏళ్ల వృద్ధుడు పీహెచ్‌డా పూర్తి చేసి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు.

తన చిన్నతనం నుంచే..
అసలు విషయంలోకెళ్లితే...యూఎస్‌కి చెందిన మాన్‌ఫ్రెడ్ స్టైనర్ 89 ఏళ్ల వయసులో పిహెచ్‌డి చేసి భౌతిక శాస్త్రవేత్త కావాలనే తన కలను సాధించాడు. ఈ మేరకు స్టైనర్ ఈస్ట్ ప్రొవిడెన్స్, రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించాడు. అంతేకాదు  స్టైనర్‌కి తన చిన్నతనం నుంచే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, మాక్స్ ప్లాంక్‌ల గురించి చదివి తాను కూడా వారిలా భౌతిక శాస్త్రవేత్త కావాలని అనుకునేవాడు. అయితే  స్టైనర్‌ తల్లి, మేనమామ సూచన మేరకు 1955లో వియన్నా విశ్వవిద్యాలయం నుంచి తన వైద్యా  విద్యను పూర్తి చేశాడు.

70 ఏళ్ల వయస్సులో..
ఆ తర్వాత స్టైనర్ యూఎస్‌ వెళ్లి టఫ్ట్స్ యూనివర్సిటీలో హెమటాలజీని,  మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బయోకెమిస్ట్రీని అభ్యసించారు. ఈ మేరకు అతను 1985 నుంచి 1994 వరకు బ్రౌన్‌లోని మెడికల్ స్కూల్లో హెమటాలజీ విభాగానికి అధిపతిగా సేవలందించాడు. ఆ తర్వాత స్టైనర్ 2000లో మెడిసిన్ విభాగం నుంచి రిటైర్ అయ్యాడు. అయితే  స్టైనర్‌కి వైద్య పరిశోధన సంతృప్తికరంగా ఉంది, కానీ భౌతికశాస్త్రం మీద తన ఆసక్తిని కోల్పోలేదు. దీంతో స్టైనర్‌ 70 ఏళ్ల వయస్సులో బ్రౌన్ వద్ద అండర్ గ్రాడ్యుయేట్ తరగతులు తీసుకోవడం ప్రారంభించాడు.

తన జీవితంలో..
పైగా 2007 నాటికల్లా పీహెచ్‌డీ ప్రోగ్రాం చేసేందుకు  కావల్సిన అన్ని అర్హతలు సంపాదించాడు. ఈ మేరకు స్టైనర్‌  ఫిజిక్స్ ప్రొఫెసర్ బ్రాడ్ మార్స్టన్ మాట్లాడుతూ..."స్టైనర్‌ను నా విద్యార్థిగా చేర్చుకోవడంపై మొదట చాలా సందేహించాను కానీ అతని అంకితభావానికి ముగ్ధుడునయ్యాను. ఇప్పుడతను నా పరిశోధనలకు సలహాదారుడిగా అయ్యాడు. అంతేకాదు నేను ఫిజిక్స్‌ పరిశోధనల్లో రాసిన దానికంటే  స్టైనర్‌ మెడికల్ సైన్స్‌లో చాలా పేపర్లు రాశాడు. యువ విద్యార్థుల్లో ఉండాల్సిన శాస్త్రీయ ఆలోచనా విధానం అభిరుచి ఇప్పటికి స్టైనర్‌ దగ్గర ఉంది."అని అన్నారు. అయితే స్టైనర్‌ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీని పూర్తి చేయడం అనేది తనకు జీవితంలో అత్యద్భుతమైన విషయం అని అన్నాడు. పైగా తనకు ఉద్యోగం చేసే వయసు దాటిపోయిందని తాను కేవలం తన ప్రోఫెసర్‌ పరిశోధనలకు సలహదారుడిగా మాత్రమే ఉంటానని చెప్పుకొచ్చారు.

97-year-old man in Bihar appears for MA exam

#Tags