Kaun Banega Crorepati: కోటి రూపాయల ప్రశ్న.. మీరు సమాధానం చెప్పగలరా?

బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్‌-16కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కల్కి సినిమాతో అభిమానులను మెప్పించిన ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. తాజా ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్‌ కోటి రూపాయల ప్రశ్న వరకు వచ్చాడు. ఆదివాసి తెగకు చెందిన కంటెస్టెంట్‌ బంటి వడివా కోటీ రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. దీంతో కోటీశ్వరుడు అయ్యే ఛాన్స్‌ను కొద్దిలో మిస్‌ చేసుకున్నారు. ఇంతకీ ఆ ప్రశ్నేంటో మనం ఓ లుక్కేద్దాం.

తాజా ఎపిసోడ్‌లో మొదటి ఆదివాసీ కంటెస్టెంట్‌ బంటి వడివా రూ. 50 లక్షలు గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో మొదటి కోటీశ్వరుడు అయ్యే అవకాశాన్ని తృటిలో మిస్‌ చేసుకున్నాడు. ఆ ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో రిస్క్‌ తీసుకోకుండా నిష్క్రమించాడు. దీంతో 50 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అమితాబ్ కూడా ప్రశంసించారు.

Free Training In Tailoring And Beautician: మహిళలకు గుడ్‌న్యూస్‌.. టైలరింగ్‌, బ్యూటీషియన్‌ కోర్సుల్లో శిక్షణ

ఒకప్పుడు రూ.260.. ఇప్పుడు రూ. 50 లక్షలు..
గతంలో తాను ముంబైకి వచ్చినప్పుడు తన బ్యాంకు ఖాతాలో రూ.260 మాత్రమే ఉన్నాయని బంటి వడివా తెలిపారు. ఇప్పుడు తన బ్యాంకు ఖాతాలో రూ.50 లక్షలకు పైగానే ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఎపిసోడ్‌లో 2024 పారిస్ ఒలింపిక్ పతక విజేతలు మను భాకర్, అమన్ షెరావత్ కూడా అతిథులుగా పాల్గొన్నారు.

Meesho Hires 8.5 Lakh Jobs: నిరుద్యోగులకు బంపర్‌ఆఫర్‌.. ఇదే కరెక్ట్‌ టైం, లక్షల్లో ఉద్యోగాల భర్తీ

కోటీ రూపాయల ప్రశ్న ఇదే..

ప్రశ్న: ది స్టాగ్ అనే ఆర్ట్‌ వర్క్‌కు బెంగాలీ శిల్పి చింతామోని కర్‌ను వరించిన పతకమేది?

ఆప్షన్స్‌: ఎ. పైథాగరస్ బహుమతి
           బి. నోబెల్ బహుమతి
           సి. ఒలింపిక్ పతకం
           డి. ఆస్కార్ పతకం

అయితే 1948లో ఒలింపిక్ గేమ్స్‌లో  కళల పోటీలు కూడా ఉన్నాయని అమితాబ్ వెల్లడించారు. అందువల్లే చింతామోని కర్‌ తన కళాకృతికి ఒలింపిక్‌ రజత పతకాన్ని గెలుచుకున్నాడని తెలిపారు. కాగా.. కౌన్‌ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షో సోనీలివ్‌లో ప్రసారమవుతోంది. 


 

#Tags