Google Translated Search Results: మరిన్ని భాషల్లో గూగుల్ సెర్చ్ రిజల్ట్స్..

గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ ఇప్పుడు మరిన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చింది. గతంలో కేవలం 13 భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 21కి చేరింది. ఇంతకీ ఇప్పుడు అందుబాటులో ఉన్న భాషలు ఏవి, అందులో భారతీయ భాషలు ఎన్ని అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.

Telangana DSC Exams From Tomorrow: దాదాపు ఏడేళ్ల తర్వాత.. రేపటి నుంచి డీఎస్సీ పరీక్షలు, ముందురోజు ఇలా చేయండి

గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో కొత్తగా చేరిన భాషలు మొత్తం ఎనిమిది. అవి అరబిక్, గుజరాతీ, కొరియన్, పర్షియన్, థాయ్, టర్కిష్, ఉర్దూ, వియత్నామీస్‌. ఇప్పటికే 13 భాషల్లో ఇది వినియోగంలో ఉంది. దీంతో మొత్తం భాషలు 21కి చేరాయి.

Recruitment Drive: 600 ఉద్యోగాలకు 25వేల మంది పోటీ.. ఎయిర్‌పోర్ట్‌లో తొక్కిసలాట

అంటే గూగుల్ సెర్చ్ ఫలితాలు అరబిక్, బెంగాలీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, గుజరాతీ, హిందీ, ఇండోనేషియా, కన్నడ, కొరియన్, మలయాళం, మరాఠీ, పర్షియన్, పోర్చుగీస్, స్పానిష్, తమిళం, తెలుగు, థాయ్, టర్కిష్, ఉర్దూ, వియత్నామీస్ భాషల్లో కూడా పొందవచ్చు.

ఈ మొత్తం 21 భాషల్లో భారతీయ భాషలు.. బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు, ఉర్దూ. సెర్చ్ రిజల్ట్స్‌ ఇప్పుడు మరిన్ని భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల మరింత మంది యూజర్స్ దీన్ని ఉపయోగించే అవకాశం ఉంది.
 

#Tags