Skip to main content

World Earth Day 2024: 'భూమి భద్రం' అని హైలెట్‌ చేసేలా గూగుల్‌ డూడుల్‌.. ఈ ఏడాది 'ఎర్త్ డే' థీమ్ ఇదే.. !

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ధరిత్రి(ఎర్త్‌ డే) దినోత్సవాన్ని జరుపుకుంటారు.
World Earth Day 2024 Google Doodle Spotlights Climate Change

దీన్ని అంతర్జాతీయ "మదర్ ఎర్త్ డే" అని కూడా పిలుస్తారు. ఈ ప్రత్యేకమైన ప్రపంచ ధరిత్రి దినోత్సవం నాడు.. గూగూల్‌ భూమి పరిరక్షణ కోసం ఆచరించాల్సిన ఆరింటిని గూర్చి హైలెట్‌ చేస్తూ చక్కటి డూడుల్‌ని ప్రదర్శించింది. భూమిని భద్రంగా ఉంచితేనే మన మనుగడ అని మానవునికి గుర్తు చేసేలా అద్భుతంగా ఇచ్చింది. అందుకోసం ప్రజలు, ప్రభుత్వాలు అధికారులు చేయాల్సిన వాటిని తన డూడిల్‌ ప్రదర్శనలో చక్కగా వివరించింది. మన తరువాత తరాలకు ఈ సంపదను అందేలా భద్రపరచడం గురించి నొక్కి చెబుతోంది.

ఈ గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ లేకపోతే జీవనం గడవదు అన్నంతగా దానిపై మనిషి ఆధారపడిపోయిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ దేనికో దాని కోసం తప్పక వెతకడం కోసం గూగుల్‌ని ఓపెన్‌ చేయడం జరుగుంది. దీంతో గూగుల్‌పై ఒక్క క్లిక్‌ చేయగానే సాక్షాత్కరించే ఆ డూడిల్‌ కచ్చితంగా.. ప్రతి ఒక్కరిలోనూ భూమిని పరిరక్షించుకోవాలనే అనే అవగాహ కల్పించేలా సవివరంగా ఉంది. 

ఇక ఆ డూడిల్‌ ఏం వివరిస్తోందంటే.. ఏడాది పొడవునా నీరు, విద్యుత్‌ వంటి వనరులను ఆదా  చేయడానికి మన వంతుగా చేయాల్సినవి గుర్తు చేసింది. అది ఒక ఆకర్షణీయమైన చిత్రంలాగానే కాకుండా అందులో ప్రతి అక్షరం ప్రపంచ పరిరక్షణన గురించి చక్కగా హైలెట్‌ చేసింది. ముందుగా గూగుల్‌లోని 'జీ' అనే అక్షరం టర్క్స్‌, కైకోస్‌ దీవులు, జీవవైవిధ్యం, సహజవనరులు, అంతరించిపోతున్న జాతులను రక్షించడాన్ని వివరిస్తోంది.

National Civil Services Day: ఏప్రిల్ 21వ తేదీ జాతీయ పౌర సేవల దినోత్సవం.. ఈ రోజు ప్ర‌త్యేక‌త‌లు ఇవే..

ఇక 'వో' మెక్సికోలోని స్కార్పియన్ రీఫ్ నేషనల్‌ పార్క్‌ని తెలుపుతుంది. ఇక్కడ ఈ నేషనల్‌ పార్క్‌ దక్షిణ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో అతిపెద్ద రీఫ్. పైగా ఇది యునెస్కో బయోస్పియర్‌ రిజర్వ్‌ సంక్లిష్టమైన పగడపు దిబ్బలు, అంతరించిపోతున్న పక్షలు, తాబేళ్లను కాపాడటాన్ని తెలియజేస్తోంది.

అలాగే గూగుల్‌లోని 'ఎల్‌' అనే అక్షరం గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ని ఇండికేట్‌ చేస్తోంది. అంటే ఇది ఆఫ్రికలోని ఎడారీకరణ కారణంగా ప్రభావితమైన భూమిని పునరుద్ధరించడం, చెట్లు, ఇతర వృక్షాలను నాటడం, స్థిరమైన భూ నిర్వహణ పద్ధతులను అమలు చేయడం గురించి వివిరిస్తోంది.

చివరిగా 'ఈ' అనే అక్షరం ఆస్ట్రేలియాలోని పిల్బరా దీవుల నేచర్ రిజర్వ్‌లను చూపిస్తుంది. ఇది ఆస్ట్రేలియాలోని సుమారు 20 ప్రకృతి అద్భుతాల్లో ఇది ఒకటి. అక్కడ అంతరించిపోతున్న జాతులు, మారుతున్న పర్యావరణ వ్యవస్థలు, సహజ ఆవాసాలను రక్షించుకోవాలని చెబుతోంది. 

ఇక ఈ ఏడాది 2024 ఎర్త్‌ డే థీమ్‌ "ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్". ఇది భూమి పరిరక్షణపై అవగాహన కల్పించేలా చేయడం, చిన్న ప్లాస్టిక్‌ను కూడా లేకుండా చేయడమే గాక ప్లాస్టిక్‌ కాలుష్యంపై యూఎన్‌ ఒప్పందానికి తక్షణమే ఒత్తిడిని తేవలని పిలుపునిస్తోంది. అంతేగాక ఎర్త్‌డే అధికారిక వెబ్‌సైట్‌ ఫాస్ట్‌ ఫ్యాషన్‌కు ముగింపు పలకాలని డిమాండ్‌ చేస్తుంది. 

World Hemophilia Day 2024: ఏప్రిల్ 17న ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం.. ఈ సంవ‌త్స‌రం థీమ్ ఇదే..

Published date : 23 Apr 2024 01:56PM

Photo Stories