Skip to main content

Medical College: మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో మెరుగైన వైద్యం

Medical College
Medical College

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో జిల్లా వాసులకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని ఎమ్మెల్యే సక్కు అన్నా రు. జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్‌లో నిర్మి స్తున్న మెడికల్‌ కళాశాల పనులను అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ల్యాబ్‌, స్టాఫ్‌, తరగతి గదుల పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 15న కాలేజీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌తోనే జిల్లాకు మెడికల్‌ కళాశాల మంజూరైందన్నారు. ప్రిన్సిపాల్‌ నాగర్జునచారి, జెడ్పీటీసీ నాగేశ్వర్‌రావు, ఎంపీపీ మల్లికార్జున్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 12 Sep 2023 06:01PM

Photo Stories