Skip to main content

Teachers transfer: ఉపాధ్యాయ బదిలీలకు 4,410 దరఖాస్తులు

teacher transfers
teacher transfers

నల్లగొండ : ఉపాధ్యాయ బదిలీలకు 4,410 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఉపాధ్యాయ బదిలీలకు కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో విద్యా శాఖ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఉపాధ్యాయుల నుంచి బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించింది. ఈ నెల 3వ తేదీ నుంచి నేటి వరకు మూడు రోజుల్లో 318 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. అంతకుముందు జనవరిలో 4,092 మంది దరఖాస్తు చేసుకొని ఉన్నారు. మొత్తం కలిపి 4,410 దరఖాస్తులు వచ్చాయి.

Published date : 06 Sep 2023 07:31PM

Photo Stories