Skip to main content

రేపు మెగా జాబ్‌మేళా

Mega Job Mela tomorrow
Mega Job Mela tomorrow

కంచరపాలెం: జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సెంటర్‌లో ఈ నెల 11న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారులు సిహెచ్‌ సుబ్బిరెడ్డి(క్లరికల్‌), కె.శాంతి(టెక్నికల్‌) తెలిపారు. మెడ్‌ప్లస్‌, డైకిస్‌, సెంట్రల్‌ ఫార్మసీ, ది లివరేజ్‌ ప్రోవిన్స్‌, బ్లూస్టార్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎక్స్‌ టెక్స్‌ టెస్టింగ్‌, ఆదాన్‌ సొల్యూషన్స్‌, టెక్నో సాఫ్ట్‌ సొల్యూషన్స్‌, హ్యూమన్‌ పవర్‌ సర్వీసెస్‌, సపోర్ట్‌ సర్వీసెస్‌, ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో 545 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. కస్టమర్‌ అండ్‌ ఫీల్డ్‌ ట్రైనీ, సేల్స్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌, ఫార్మసిస్ట్‌, అసెంబ్లీ ఆపరేటింగ్‌ కాల్‌ అసిస్టెంట్‌, ఆపరేటర్‌, కస్టమర్‌ ఎగ్జిక్యూటివ్‌, కెమిస్ట్‌, క్యాషియర్‌, జూనియర్‌ క్యాడ్‌ ఇంజినీర్‌, కార్పెంటర్‌, వేర్‌హౌస్‌ అసోసియేట్స్‌, జీఐఎస్‌ ఇంజినీర్‌ క్యాడ్‌, అకౌంటెంట్‌, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌, కేర్‌ టేకర్స్‌, సెక్యూరిటీ గార్డ్స్‌, బ్రాంచ్‌ గొడౌన్‌ ఇన్‌చార్జి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, ఐటీఐ, బీటెక్‌, ఎంబీఏ పూర్తి చేసిన 18–38 ఏళ్ల వయసు కల్గిన పురుష, మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఆయా ఉద్యోగాల బట్టి జీతం నెలకు రూ.10,000 నుంచి రూ.30,000 వరకు ఉంటుందన్నారు.

Published date : 10 Aug 2023 05:44PM

Photo Stories