Skip to main content

Job Mela: 20న జాబ్‌మేళా

District Employment Office Announcement, Job Mela on 20th,50 Vacancies at Mango Motors,National Career Service Center

కంచరపాలెం: స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సెంటర్‌లో ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా సబ్‌ రీజినల్‌ ఎంప్లాయిమెంట్‌ అధికారి నిట్టాల శ్యామ్‌ సుందర్‌ తెలిపారు. మ్యాంగో మోటార్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో 50 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామన్నారు. పెయింటర్‌, వాషింగ్‌, సర్వీస్‌ అడ్వైజర్‌, మార్కెటింగ్‌ సేల్‌ ఎగ్జిక్యూటివ్‌, టీమ్‌ లీడర్‌, సేల్స్‌ మేనేజర్‌ ఉద్యోగాలకు టెన్త్‌, ఇంటర్మీడియట్‌, ఏదైనా డిగ్రీ, డిప్లమో, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించిన 18–45 ఏళ్ల పురుష, మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఆయా ఉద్యోగం బట్టి జీతం నెలకు రూ.15,000–40,000వరకు ఉంటుందన్నారు. విశాఖ, శ్రీకాకుళం, రాజాం ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ncs.gov.in వెబ్‌సైట్‌ లో తమ పేర్లు రిజిస్ట్రర్‌ చేసుకోవాలని సూచించారు.
 

Published date : 19 Oct 2023 11:40AM

Photo Stories