Job Mela: రేపు జాబ్‌మేళా
కాళోజీ సెంటర్ : ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ములుగు రోడ్డు ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లోని జిల్లా ఉపాఽధి కార్యాలయంలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్.మాధవి తెలిపారు. ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారు టెక్నీషియన్, సూపర్‌వైజర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, టెలికాలర్‌గా ఉచిత శిక్షణ ఇచ్చి వరంగల్, హైదరాబాద్‌లో పనిచేసేందుకు సుమారు 40 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు, కనీసం 8వ తరగతి చదివి ఉండాలని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణ, వసతి సదుపాయం ఉంటుందని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు శుక్రవారం విద్యార్హత సరిఫికెట్ల జిరాక్స్ కాపీలతో జిల్లా ఉపాధి కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 77993 14685 నంబర్‌లో సంప్రదించాలని ఆమె సూచించారు.
చదవండి: Mini Job Mela: 6న మినీ జాబ్ మేళా