Skip to main content

26న జాబ్‌ మేళా

నరసరావుపేట ఈస్ట్‌: ఈనెల 26న మాచర్లలోని చక్రధర్‌ డిగ్రీ కళాశాలలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ తెలిపారు.
Job fair on 26th August
26న జాబ్‌ మేళా

కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాబ్‌ మేళా వాల్‌పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఆధ్వర్యంలో జరిగే జాబ్‌ మేళాలో దాదాపు 15 కంపెనీలు పాల్గొంటాయని వివరించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సంజీవరావు మాట్లాడుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జాబ్‌ మేళా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇతర వివరాలకు ఆర్‌.కిరణ్‌ (9842747682), పి.శ్రీకాంత్‌ (9492158153), నానికా నాయక్‌ (9010585360), ఖాదర్‌బాష (9440988148)లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఏ.శ్యామ్‌ప్రసాద్‌, జిల్లా రెవిన్యూ అధికారి వినాయక, పిడి డీఆర్‌డీఏ బి.బాలునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 08 Aug 2023 05:09PM

Photo Stories