Skip to main content

ONGC Permanent jobs: ONGC లో పర్మినెంట్ ఎగ్జిక్యూటివ్ లెవల్ ఉద్యోగాలు జీతం నెలకు 1,80,000

ONGC jobs  ONGC recruitment notification 2025  Oil and Natural Gas Corporation recruitment announcement  Apply for ONGC executive jobs
ONGC jobs

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ (ONGC) నుండి 108 ఎగ్జిక్యూటివ్ లెవల్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా Geologist , Geophysicist (Surface and wells) మరియు వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో AEE ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

100 రోజుల పాటు Tally, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ: Click Here

రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ కావడం జరిగింది. 

భర్తీ చేస్తున్న పోస్టులు: Geologist , Geophysicist (Surface and wells) మరియు వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో AEE ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య:
108 ఉద్యోగాలు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. పోస్టుల వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 
జియాలజిస్ట్ – 05 పోస్టులు 
జియో ఫిజిక్స్ (Surface) – 03 పోస్టులు 
జియో ఫిజిక్స్ (Wells) – 02 పోస్టులు 
AEE (ప్రొడక్షన్)- మెకానికల్ – 11 పోస్టులు 
AEE (ప్రొడక్షన్) – పెట్రోలియం – 19 పోస్టులు 
AEE (ప్రొడక్షన్) – కెమికల్ – 23
AEE (డ్రిల్లింగ్) – మెకానికల్ – 23
AEE (డ్రిల్లింగ్) – పెట్రోలియం 06
AEE (మెకానికల్) – 06
AEE (ఎలక్ట్రికల్) – 10

విద్యార్హతలు: 
AEE (Production) , AEE (Drilling), AEE (Mechanical) , AEE (Electrical) ఉద్యోగాలకు కనీసం 60% మార్కులుతో మెకానికల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ / పెట్రోలియం ఇంజనీరింగ్ / కెమికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
Geologist, Geophysicist (Surface), Geophysicist (Wells) ఉద్యోగాలకు కనీసం 60% మార్కులుతో జియాలజీ / జియోఫిజిక్స్ / పెట్రోలియం జియోసైన్స్ / జియోఫిజికల్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు: 
AEE (Production) , AEE (Drilling), AEE (Mechanical) , AEE (Electrical) ఉద్యోగాలకు UR / EWS అభ్యర్ధులకు గరిష్ట వయస్సు – 26 సంవత్సరాలు , OBC (NCL) అభ్యర్థులకు గరిష్ట వయస్సు 29 సంవత్సరాలు , SC / ST అభ్యర్థులకు గరిష్ట వయస్సు 31 సంవత్సరాలు.
Geologist, Geophysicist (Surface), Geophysicist (Wells) ఉద్యోగాలకు UR / EWS అభ్యర్ధులకు గరిష్ట వయస్సు – 27 సంవత్సరాలు , OBC (NCL) అభ్యర్థులకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు , SC / ST అభ్యర్థులకు గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు.

వయసులో సడలింపు : ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :
ఎంపిక విధానంలో క్రింది విధంగా వివిధ దశలు ఉంటాయి.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 
పర్సనల్ ఇంటర్వ్యూ 
గ్రూప్ డిస్కషన్ 
ఫైనల్ మెరిట్ లిస్ట్

జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 60,000/- నుండి 1,80,000/- వరకు పే స్కేలు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు: 
GEN / EWS/ OBC అభ్యర్థులకు ఫీజు 1000/-
SC, ST , PWD అభ్యర్థులకు ఫీజు లేదు.

అప్లై విధానము: ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి.

ముఖ్యమైన తేదీలు: 
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 10/01/2025
అప్లికేషన్ చివరి తేదీ : 24/01/2025 
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ : 23/02/2025


Download Full Notification: Click Here
 

Published date : 13 Jan 2025 08:34AM

Photo Stories