Jobs in T-Hub: టీ–హబ్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు రూ.లక్ష వేతనం..

పాలమూరు/మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని టీ–హబ్‌లో ఖాళీగా ఉన్న ఎండీ పెథాలజిస్ట్, ల్యాబ్ మేనేజర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ జి.రవినాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎండీ పెథాలజిస్ట్ పోస్ట్‌కు ఎండీ పెథాలజీ ఉతీర్ణులై ఉండటంతో పాటు ఐఎంసీ, స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో నమోదు చేసుకొని ఉండాలని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు ఎంపిక అయిన వారికి నెలకు రూ.లక్ష వేతనం ఉంటుందని తెలిపారు. ల్యాబ్ మేనేజర్ పోస్ట్‌కు ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండటంతో పాటు మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రి సబ్జెక్టు కలిగి ఉండాలని, ఈ పోస్ట్‌కు ఎంపికై న వారికి నెలకు రూ.30వేల వేతనం ఉంటుందని వివరించారు. ఈ నెల 29లోగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 31న వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ఫిబ్రవరి 5న మెరిట్ లిస్ట్ ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. జాబితాపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 8న సమర్పించాలని, ఫిబ్రవరి 15న ఎంపికై న వారి జాబితాను ప్రదర్శిస్తామని వివరించారు.