Teachers: ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలి
విజయనగరం అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయ హక్కులకు భంగం కలిగించే అక్రమ బదిలీలను రద్దు చేయాలని యూటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం స్థానిక యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశ మందిరంలో జిల్లా కమిటీ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించించారు. ఈ సందర్భంగా బదిలీల కౌన్సెలింగ్ సమయంలో ఉపాధ్యాయులకు అదనంగా ఉన్న ఖాళీలను చూపించమంటే ఖాళీలు లేవని తప్పుడు సమాచారం ఇచ్చి ఆయా స్థానాలలో అక్రమ బదిలీలతో నింపడాన్ని సమావేశంలో ఖండించారు. జిల్లా అధ్యక్షుడ జేఆర్‌ఎల్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జేఏవీఆర్‌కే ఈశ్వరరావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎ.సత్యశ్రీనివాస్, జిల్లా సహధ్యక్షులు వి.ప్రసన్నకుమార్, జి.పార్వతి, కోశాధికారి సీహెచ్.భాస్కరరావు, జిల్లా కార్యదర్శులు కె.ప్రసాదరావు, సీహెచ్.తిరుపతినాయుడు, ఎన్.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.