విద్యతోనే ఉన్నత స్థాయికి..
మంగళవారం వికారాబాద్ పట్టణంలోని స్త్రీశక్తి భవనంలో సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శ్రీవిద్యాహక్కు చట్టం అమలు–ప్రజల భాగస్వామ్యంశ్రీపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్ మాట్లాడుతూ.. విద్యతో ఏదైనా సాధించవచ్చుననే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. పిల్లలు ఉన్నత విద్యావంతులుగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలని సూచించారు. నేటికీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తరగతి గదికి తగిన సామర్థ్యాలు విద్యార్థుల వద్ద లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా బాలల రక్షణ విభాగం చైల్డ్ లైన్ 1098, 100, సఖి లాంటి సంస్థలు ఉన్నతంగా పనిచేస్తున్నాయన్నారు. ఎక్కడ ఇబ్బందులున్నా వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. అనంతరం సాధన సంస్థ కోఆర్డినేటర్ మురళి మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం వచ్చి పదేళ్లు దాటినా నేటికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బాలల సంక్షేమ కమిటీ సభ్యులు ప్రకాష్, సంగమేశ్వర్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, సఖి ప్రతినిధులు ప్రకాశ్, నర్సింలు, ఎంవీ ఫౌండేషన్ ఇన్‌చార్జి వెంకటయ్య, బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు రంగారెడ్డి, వెంకట్రావు, నాగరాజు, చైల్డ్ లైన్ కౌన్సిలర్ రామేశ్వర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లు, వివిధ సంస్థల ప్రతినిధులు, సాధన మండల ఇన్‌చార్జి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.