IT Crisis: మీరు మాత్రం ఇలా చేస్తే రోడ్డున పడతారు.. కారు, ఇళ్లు అమ్ముకుని వెళితే టెకీకి దిమ్మతిరిగే షాక్

అమెజాన్ భారీ తొలగింపుల వల్ల ప్రభావితమైన 18వేల ఉద్యోగుల్లో తానూ ఒకడినని, ఐరోపా వెళ్లడానికి నాలుగు రోజుల ముందు తాను ఉద్యోగాన్ని కోల్పోయానంటూ కెన్యా టెకీ ఒపియో వాపోతున్నాడు. ‘‘ కుటుంబంతో సహా వెళ్లేందుకు, ఉన్న ఇల్లును, కార్లను అమ్మేశా. .. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే జనవరి16వ తేదీ అమెజాన్ లో ఉద్యోగంలో చేరే వాడిని.
చదవండి: తుమ్మితే ఊడుతున్న ఐటీ జాబ్స్... ఐఐటీ కొలువులకూ భద్రత లేదు..?
కానీ, పరిస్థితి తారుమారైంది. తర్జన భర్జన పడి, 6 నెలల నుంచి ఎంతో కష్టపడి ప్లాన్ చేసుకుని, ప్రయాణానికి సిద్ధమవుతుండగా, ఇంతలోనే ఉద్యోగాన్ని కోల్పోవడం చాలా బాధగా ఉంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ భారీ షాక్‌నుంచి తేరుకుని మళ్లీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాల్సి ఉందని రాసుకొచ్చాడు.
అనుభవమే పాఠాలు నేర్పిస్తుంది అంటే ఇదే కాబోలు. తన అనుభవం దృష్ట్యా ఇప్పుడు ఒపియో పదిమందికి సలహాలు ఇచ్చేస్థాయికి చేరుకున్నాడు. ‘‘వేరే దేశానికి ఉద్యోగ నిమిత్తం వెళ్లాలనుకుంటే, ముందు మీరు వెళ్లి ఆ తరువాత ఫ్యామిలీని తీసుకెళ్లడం గురించి ఆలోచించండి... వీసా వచ్చే వరకు ప్రస్తుతం చేస్తున్న జాబ్‌కు రాజీనామా చేయకండి’’ అంటూ చెప్తున్నాడు.
చదవండి: కంటి చూపులేకపోతేనేం... 47 లక్షలతో జాబ్ కొట్టాడిలా..
తనకు వీసా రావడానికి 5 నెలలకు పైగా సమయం పట్టిందని.. ఫ్యామిలీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీస్ క్లియరెన్స్, కొత్త పాస్‌పోర్ట్, వర్క్ ఆథరైజేషన్ అప్రూవల్స్, డాక్యుమెంట్‌ల నోటరైజేషన్ పొందడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొస్తున్నాడు. తన కెరియర్‌లో ఇంతటి కష్టమైన పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదని అంటున్నాడు. మనకెదురైన అనుభవాలు, పరిస్థితులు ఇతరులకు ఉదాహరణలుగా, పాఠాలుగా నిలుస్తాయంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు.