Skip to main content

Anganwadi jobs: అంగన్‌వాడీలో ఉద్యోగాలు దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..

Recruitment Notice: District Sitra for Women & Child Welfare Posts, Announcement: District Sitra Officer on Job Opportunities, Official Notice: Filling Posts in Women Development & Child Welfare Dept, Job Vacancies in West Godavari - Contract Basis, B. Sujatha Rani, Child Development Empowerment Officer, District Sitra Statement, Anganwadi jobs, Notification: Posts in Women Development & Child Welfare Department - West Godavari District,
Anganwadi jobs

పశ్చిమగోదావరి జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశామని జిల్లా సీ్త్ర, శిశు అభివృద్ధి సాధికారత అధికారి బి.సుజాత రాణి ఓ ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్‌ పద్ధతిలో పోస్టులు భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు.

డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి, ప్రొటెక్షన్‌ అధికారి (ఇనిస్టిట్యూషనల్‌), (నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌), లీగల్‌ కమ్‌ ప్రొబిషన్‌ ఆఫీసర్‌, సోషల్‌ వర్కర్‌, డేటా అనలిస్ట్‌, అసిస్టెంట్‌ కమ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఔట్‌ రిచ్‌ వర్కర్‌ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.

అలాగే ఎస్‌ఏఏకు సంబంధించి మేనేజర్‌/కో–ఆర్డినేటర్‌, సోషల్‌ వర్కర్‌/ఎర్లీ చైల్డ్‌ ఉడ్‌, నర్సు, డాక్టర్‌ (పార్ట్‌టైమ్‌), ఆయాలు, చౌకీదార్‌ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో http://westgodavari.ap.gov.in ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

అలాగే అంగన్‌వాగీ పోషణ 2.0 కింద డిస్ట్రిక్ట్‌ కో–ఆర్డినేటర్‌–1, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌–1, బ్లాక్‌ కో–ఆర్డినేటర్‌–2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, దరఖాస్తులు భీమవరం జిల్లా సీ్త్ర, శిశు అభివృద్ధి, సాధికారత అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంటాయన్నారు.

Published date : 08 Nov 2023 07:55AM

Photo Stories