School Inspection : పాఠశాలలను పరిశీలించిన డీఈఓ..
Sakshi Education
తాడేపల్లి రూరల్: దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలను డీఈఓ పి.శైలజ బుధవారం సందర్శించారు. తొలుత పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం నాడు–నేడు పనులను, విద్యార్థులకు అందజేస్తున్న స్టూడెంట్స్ కిట్స్‌ను పరిశీలించి, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుని స్వయంగా తెలుసుకుని, విద్యార్థులతో కలసి భోజనం చేశారు. అనంతరం రేవేంద్రపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఆమె వెంట దుగ్గిరాల ఎంఈఓలు కాజా శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
Published date : 12 Jul 2024 10:05AM