Skip to main content

Training for Teachers: ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరం

Training for teachers in Local Government High School

జయపురం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉత్కర్ష కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు 3రోజుల శిక్షణ శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలిరోజు బొయిపరిగుడ, కుంద్రా, సెమిలిగుడ, కొరాపుట్‌, లమతాపుట్‌ సమితుల నుంచి 122మంది ఉపాధ్యాయు లు హాజరు కాగా.. భాష, విజ్ఞానం(సైన్స్‌) అంశాలపై శిక్షణ అందించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రామచంద్ర నాయక్‌ పర్యవేక్షణలో జరిగిన శిబిరంలో జిల్లా అదనపు విద్యాధికారి జగన్నాథ్‌ పాత్రొ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యామ మెహరా, సీనియర్‌ ఉపాధ్యాయులు యజ్ఞేశ్వర పండా, జగన్నాథ సాహు, సిద్ధార్థ శంకర మహాపాత్రొ పాల్గొని, పలు సూచనలందించారు. 2, 3 రోజుల్లో మిగతా సమితులకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొనున్న ట్లు తెలిపారు. కార్యక్రమాన్ని జిల్లా ఉపాధ్యాయ కో –ఆర్డినేటర్‌ చంద్రకళా భగర్తి, జిల్లా విజ్ఞాన పర్యవేక్షకులు అనంత దళపతి పర్యవేక్షించారు.

Free Training for Women: నిరుద్యోగ మహిళలకు ఈ కోర్సుల్లో ఉచిత శిక్షణ... ఇలా దరఖాస్తు చేసుకోండి

Published date : 22 Jul 2023 04:07PM

Photo Stories