సొంత ఖర్చుతో..విద్యార్థులను ఆకాశాన తిప్పిన గొప్ప టీచర్..ఎందుకంటే..?
Sakshi Education
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలోని మద్దన్నగారిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులను ఆ పాఠశాల ఉపాధ్యాయుడు రమేశ్ తన సొంత ఖర్చుతో విమానంలో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.
ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా పాఠశాలకు చెందిన విద్యార్థులను జాతీయ నేతల వేషధారణలో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకెళ్లారు. ఏటా చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి విమానంలో విహరింపజేస్తుంటారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఐదుగురు విద్యార్థులను పిలుచుకెళ్లారు.
Published date : 05 Oct 2021 06:03PM