Skip to main content

Scholarships: ఆన్‌లైన్‌లో మెరిట్‌ కార్డులు.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

Merit cards delay announcement  National Scholarship Examination (NMMS) information  Government examination office website  Scholarships  District School Education Department Officer K. Vasudeva Rao

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో గత ఏడాది డిసెంబర్‌ 3న జరిగిన జాతీయ ఉపకార వేతన పరీక్ష(ఎన్‌ఎంఎంఎస్‌)లో ఎంపికై న విద్యార్థులకు మెరిట్‌ కార్డులు అందజేయడంలో జాప్యం జరుగుతోందని జిల్లా పాఠశాల విద్యా శాఖ అధికారి కె.వాసుదేవరావు సోమవారం తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వెబ్‌ మెరిట్‌ కార్డ్‌లను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్‌సైట్‌ www.bse.ap.gov.inలో అందుబాటులో ఉంచామన్నారు.

ఎంపికై న విద్యార్థులు వెంటనే ఈ వెబ్‌సైట్‌ నుంచి మెరిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకుని, పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు తదితర వివరాలను వారి ఆధార్‌ కార్డ్‌తో సరిచూసుకోవాలని సూచించారు. ఏవైనా తేడాలుంటే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా తమకు అందజేయాలన్నారు.

Job Mela 2024: రేపు జాబ్‌ మేళా..ఈ అర్హతలు ఉంటే చాలు

పూర్తి వివరాలతో ఢిల్లీలోని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ స్కాలర్షిప్‌ పోర్టల్‌ www.scholarships.gov.inలో ఆగస్టు 31లోగా దరఖాస్తు సమర్పించి, సంబంధిత పాఠశాల, జిల్లా నోడల్‌ అధికారుల లాగిన్‌ల ద్వారా అప్రూవ్‌ చేయించుకోవాలని తెలిపారు. ముద్రించిన మెరిట్‌ కార్డ్‌లు త్వరలో తమ కార్యాలయానికి వస్తాయన్నారు. ఆధార్‌తో సీడ్‌ అయిన విద్యార్థి బ్యాంక్‌ ఖాతాకు డీబీటీ విధానంలో నగదు జమ అయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని వాసుదేవరావు స్పష్టం చేశారు.

Published date : 09 Jul 2024 01:12PM

Photo Stories