Pre-Matric Scholarship: ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌నకు రిజిస్ట్రేషన్
తిరుపతి అర్బన్: ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌నకు అర్హులైన వారు మీ పరిధిలోని సచివాలయంలో ఏప్రిల్ 10వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారిత అధికారి యూ.చెన్నయ్య తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి మాట్లాడుతూ 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో గుర్తింపు పొందిన స్కూల్స్‌లో చదువుకున్నవారు అర్హులని పేర్కొన్నారు. అయితే అపరిశుభ్ర పనిలో జీవించేవారు, మాన్యువల్ స్కావెంజర్స్, టాన్నర్ అండ్ ప్లేయర్స్, వేస్ట్ పిక్కర్స్, హజార్దౌస్ క్లీనింగ్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న వారు మాత్రమే అర్హులని తెలిపారు. డేస్ స్కాలర్ పిల్లలకు ఏడాదికి రూ.3 వేలు, హాస్టల్‌లో ఉంటున్న వారికి ఏడాదికి రూ.8వేలు ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు.
జనరల్ మేనేజర్ పోస్టుకు ఇంటర్వ్యూలు
తిరుపతి(అలిపిరి) : తిరుపతి టీటీడీ ఎంప్లాయీస్ కో – ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్ పోస్టు కోసం ఈనెల 20వ తేదీన ఉదయం 11 గంటలకు టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లోని రూమ్ నం.145 లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంకు అధ్యక్షులు చీర్ల కిరణ్ తెలిపారు. కో–ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా.. అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన వారు, 65 సంవత్సరాల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. నెలకు రూ.30 వేల జీతం ఉంటుందని తెలిపారు. వివరాలకు ఫోన్ నం.9989033100, 99897 59044లలో సంప్రదించాలని కోరారు.