Skip to main content

University Movie: విద్యా వ్యవస్థ, కార్పొరేట్‌ కళాశాలల దౌర్జన్యాల పై ఆర్‌ నారాయణమూర్తి సినిమా!

విద్యా వ్యవస్థ, కార్పొరేట్‌ కళాశాలల దౌర్జన్యాల పై దర్శక నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి యూనివర్సిటీ అనే సినిమా తీశారు.
R-Narayanamurthy-University-Movie

తన దర్శక నిర్మాణ సారథ్యంలో విడుదల కాబోతున్న యూనివర్సిటీ సినిమాను ఆదరించాలని ప్రముఖ సినీ రచయిత, దర్శక నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి కోరారు.

బుధవారం ఆయన తణుకులోని ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. యూనివర్సిటీ సినిమా ద్వారా విద్యార్థినీ విద్యార్థులకు నేటి విద్యా వ్యవస్థలో వస్తోన్న వైపరీత్యాలు, కార్పొరేట్‌ కళాశాలల దౌర్జన్యాలు అర్థమవుతాయని వివరించారు.

యూనివర్సిటీని విజయవంతం చేయాలని కోరారు. కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్‌, అద్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

Published date : 20 Jul 2023 01:06PM

Photo Stories