Professor Lalan Kumar : ఈ ప్రొఫెసర్ రూ.23 లక్షల జీతాన్ని వెనక్కి ఇచ్చేశాడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
అయితే వీటికి భిన్నంగా ఓ యూనివర్శిటీ ప్రొఫెసర్ తన జీతం ఏకంగా రూ.23 లక్షలను తిరిగి తన పని చేసే కాలేజీ యాజమాన్యానికి తిరిగి ఇచ్చేశాడు. దీని వెనుక అతను చెప్పిన కారణం విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ షాకింగ్ నిర్ణయంతో బీహార్‌లోని ముజఫర్‌పూర్ ప్రాంతంలోని నితీశ్వర్ కాలేజీకి చెందిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ వార్తల్లో నిలవడమే కాకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.
ఈ విషయంపై లాలన్ ఏమంటున్నారంటే..?
నితీశ్వర్ కళాశాలలో చేస్తున్న టీచింగ్‌తో సంతృప్తిగా లేనని తెలిపారు. ఏ మాత్రం తీసుకుంటున్న చేస్తున్న పనికి సమతూకంగా లేదని తన మనస్సాక్షి చెప్పినట్టుగానే తనకు వచ్చిన 33 నెలల జీతాన్ని మొత్తం( రూ. 23 లక్షలు) పని చేస్తున్న విశ్వవిద్యాలయానికి అంకితం చేస్తున్న అని చెప్పారు.
విద్యార్థులు లేకుండా జీతం వద్దని..
లాలన్ కుమార్ లేఖలో ఈ విధంగా రాశారు.. విద్యార్థులకు విధ్య నేర్పించకపోతే తానేందుకు జీతం తీసుకోవాలి. ఇక 25 సెప్టెంబర్ 2019 నుంచి కళాశాలలో పని చేస్తున్నాను. అండర్ గ్రాడ్యుయేట్ హిందీ విభాగంలో 131 మంది విద్యార్థులకు ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఇక్కడి యూనివర్శిటీ విద్యార్ధులు చదువుకునే వాతావరణం లేదన్నారు. తనను మరో కళాశాలకు బదిలీ చేయాలని ఆ లేఖలో కోరారు. తాను రిజిస్ట్రార్‌కు లేఖ రాసిన కాపీలను వైస్ ఛాన్సలర్, ఛాన్సలర్, పీఎంవో, రాష్ట్రపతికి కూడా పంపారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఠాకూర్ తన చెక్కును స్వీకరించడానికి మొదట నిరాకరించారు. బదులుగా అతనిని తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించమని కోరాడు. అయితే అతను తనను బదిలీ చేయాలని పట్టుబట్టాడు.