Skip to main content

Open House Program: రేపు ఐఐటీలో ఓపెన్ హౌస్ కార్య‌క్ర‌మం..

Open House Program at Indian Institute of Technology Tirupati  IIT Tirupati campus at Merlapaka Revenue in the mandal

ఏర్పేడు: మండలంలోని మేర్లపాక రెవెన్యూలో ఉన్న ఐఐటీ తిరుపతి ప్రాంగణంలో ఆదివారం ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం ఉంటుందని డైరెక్టర్‌ కేఎన్‌.సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భావి విద్యార్థుల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024లో అర్హత పొందిన విద్యార్థులతో ఇంటరాక్టివ్‌ సెషన్‌ జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఐఐటీ తిరుపతి ప్రాంగణంలో అకడమిక్‌ ప్రోగ్రాంలు, క్యాంపస్‌ అభివృద్ధి, విద్యార్థుల జీవిత అవలోకాన్ని పొందవచ్చని తెలిపారు. సెషన్‌ ప్రధానంగా ఇన్‌స్టిట్యూట్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ పాఠ్యాంశాలు, డ్యూయల్‌ డిగ్రీలు, బ్రాంచి మార్పు విధానం, హాస్టల్‌ మౌలిక, ఆరోగ్య సౌకర్యాలు, విద్యార్థి కేంద్రీకృత సమాచారం ఉంటుందని వెల్లడించారు.

Polytechnic Admission 2024: పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

Published date : 15 Jun 2024 03:41PM

Photo Stories