Old Woman : శభాష్..వందకి..89 మార్కులు.. 104 ఏళ్ల బామ్మ ఆనందం !!
పది పదుల వయసులో రాయడం, చదవడం నేర్చుకుని పరీక్షలు రాసి అందరితో శభాష్!! అనిపించుకుంది. అవిశేషాలు మీ కోసం..
తన జీవితంలో ఒక్కసారి..
ఒన్మనోరమ మీడియా తెల్పిన సమాచారం ప్రకారం.. కేరళలోని కొట్టాయాంకు చెందిన కుట్టియమ్మ తన జీవితంలో ఒక్కసారి కూడా పాఠశాలకు వెళ్లలేదు. ఐతే 104 ఏళ్ల కుట్టియమ్మ ‘సాక్షరత ప్రేరక్ రెహ్నా ప్రోగ్రాం ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించే క్లాసులకు హాజరయ్యి రాయడం, చదవడం నేర్చుకుంది. తద్వారా 4వ తరగతి పరీక్షలు రాయడానికి కుట్టియమ్మ అర్హత సాధించింది. పది పదుల వయసుదాటిన కుట్టియమ్మకు వినికిడి సమస్య ఉన్న కారణంగా పరీక్షలు నిర్వహించే ఇన్విజిలేటర్లను బిగ్గరగా మాట్లాడాలని కోరిందట కూడా. పరీక్ష కూడా భేషుగ్గా రాసింది. ఈ పరీక్షలో వందకు 89 మార్కులు సాధించింది. మార్కులను చూసుకుని ఆనందపడిపోతున్న కుట్టియమ్మ ఫొటోను కేరళ ఎడ్యుకేషన్ మినిష్టర్ వాసుదేవన్ శివన్‌కుట్టి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
చదువుకు వయసుతో..
దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో స్థానికంగా స్టార్ అయ్యింది. ‘కుట్టియమ్మ అంకితభావానికి సెల్యూట్. ఇది ఖచ్చితంగా చాలామందికి స్ఫూర్తినిస్తుందని’ సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో నెటిజన్లు ప్రశంశిస్తున్నారు. చదువుకు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైంది.