NAAC: ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ‘న్యాక్–బి’ గ్రేడ్ గుర్తింపు
తాండూరు టౌన్: తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ (నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్)–బి గ్రేడ్ గుర్తింపు లభించింది. ఆగస్టు 22, 23 తేదీల్లో న్యాక్ ద పీర్ బృంద సభ్యులు ప్రొఫెసర్ సంజీవ్ మిట్టల్, ఎంవీఎన్ ప్రసాద్, అలోక్ కుమార్ చతుర్వేది బృందం కళాశాలను సందర్శించింది. 2017 నుంచి 2022 వరకు కళాశాల పనితీరు, ఫలితాలను, కంప్యూటర్ ల్యాబ్, ప్రయోగశాలలు, బొటానికల్ గార్డెన్, క్రీడా ప్రాంగణం తదితర మౌలిక వసతులు పరిశీలించారు. అనంతరం కళాశాల పూర్వ విద్యార్థులు, పేరెంట్స్‌తో సమావేశం నిర్వహించారు. బృంద సభ్యులు అందించిన నివేదికతో బెంగళూర్‌లోని న్యాక్ కళాశాలకు బి గ్రేడ్ గుర్తింపును అందజేసింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ.. కళాశాలకు న్యాక్ బిగ్రేడ్ గుర్తింపు రావడం గర్వనీయమన్నారు. ఈ గ్రేడ్‌తో కళాశాలకు ప్రత్యేక నిధులు మంజూరవుతాయని, ఇట్టి నిధులతో కళాశాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. బి గ్రేడ్ కేటాయించడం పట్ల కళాశాల ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ డాక్టర్ సయ్యద్ అష్రాఫుల్ హక్, అధ్యాపకులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
చదవండి: TS TET 2023 exam: టెట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు