Engineering Day at JNTU: జేఎన్‌టీయూ జీవీలో మోక్ష గుండం విశ్యేశ్వరయ్య జయంతి
సాక్షి ఎడ్యుకేషన్: భారతరత్న మోక్ష గుండం విశ్వేశ్వరయ్య 163వ జయంతిని పురస్కరించుకుని స్థానిక జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీలో గురువారం ఇంజినీరింగ్ డేను ఘనంగా జరుపుకున్నారు. కళాశాల ప్రాంగణంలో తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన జేఎన్‌టీయూ జీవీ వీసీ ప్రొఫెసర్ కె.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఇంజినీర్లు ప్రొఫెషనల్‌గానే కాకుండా సోషల్ యాక్టివిటీస్‌లో కూడా పాల్గొనాలని సూచించారు.
Spot Admissions in ITI: 20 నుంచి ఐటీఐలో స్పాట్ అడ్మిషన్లు
ఎన్నో అద్భుత ప్రాజెక్టుల నిర్మాణంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన వంతు సేవలందించి దేశాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ (నీటిపారుదల శాఖ) ఐఎస్‌ఎన్‌రాజు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో సివిల్ ఇంజినీర్ల పాత్ర చాలా కీలకమని మెరుగైన ఆలోచనల ఆ్వరా మంచి ఫలితాలు పొందవచ్చన్నారు. విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలను ప్రతి విద్యార్ధి ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం ముఖ్యఅతిథులను రిజి స్ట్రార్ ప్రొఫెసర్ స్వామినాయుడు సత్కరించారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.శ్రీకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.గురునాథ, వివిధ విభా గాల అధిపతులు విద్యార్థులు పాల్గొన్నారు.