Exams Postponed: ఎంజీయూ డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా
Sakshi Education
నల్లగొండ రూరల్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో జరిగే డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి మిర్యాల రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఐఎంబీఏ, ఐపీసీ, లా, ఎంఈడీ కోర్సులకు జులై 22న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. జులై 24న జరగాల్సిన పరీక్ష యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. అదే విధంగా జులై 22, 24న జరగాల్సిన డిగ్రీ పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. వాయిదా వేసిన పరీక్షలకు త్వరలో తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Published date : 22 Jul 2023 05:58PM