Andhra University: ఏయూతో కెనడాకు చెందిన ఆరెంజ్ న్యూరో సైన్సెస్ సంస్థ అవగాహన ఒప్పందం
Sakshi Education
ఏయూ క్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయంతో కెనడాకు చెందిన ఆరెంజ్ న్యూరో సైన్సెస్ సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుంది. మంగళవారం ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణమోహన్, ఆరెంజ్ న్యూరోసైన్సెస్ సంస్థ సీఈవో డాక్టర్ వినయ్ సింఘ్‌లు సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.శ్రీనివాస రావు, సైకాలజీ విభాగాధిపతి ఆచార్య ఎం.వి.ఆర్ రాజు, అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్ ఎం.జేమ్స్ స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు. అవగాహన ఒప్పందంలో భాగంగా డిజిటల్ థెరపీ సెంటర్ ఏర్పాటు చేయడం, పరిశోధకులకు ఉచిత శిక్షణ అందించడం, రూ.10 లక్షలు విలువైన థెరపీ లైసెన్స్ ఏయూకు అందించనుంది. రెండు సంస్థలు కలసి పనిచేయాలని నిర్ణయించాయి.
Published date : 23 Aug 2023 02:45PM