Group II Free Coaching: గ్రూప్–2కు ఉచిత శిక్షణ
Sakshi Education
న్యూశాయంపేట : తెలంగాణ మైనారిటీ సంక్షేమశాఖ, మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్–2 ఉద్యోగాల పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు హనుమకొండ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీను ఆగస్టు 22న ఒక ప్రకటనలో తెలిపారు.
ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆగస్టు 28 లోగా అందజేయాలని సూచించారు. వివరాలకు సుబేదారిలోని కలెక్టరేట్ కాంప్లెక్స్ రెండో అంతస్తులో ఉన్న కార్యాలయంలో లేదా 7330990322 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
Published date : 23 Aug 2023 01:54PM