Army Attachment Camp 2023: ఆర్మీ అటాచ్‌మెంట్ క్యాంపునకు ‘ఎల్‌బీ’ విద్యార్థులు
రామన్నపేట: హైదరాబాద్‌లో మెహదీపట్నంలో జరిగే ఆర్మీ అటాచ్‌మెంట్ క్యాంపునకు నగరంలోని ఎల్‌బీ కళాశాల ఎన్‌సీసీ పదో బెటాలియన్ నుంచి 10 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డీహెచ్‌రావు తెలిపారు. క్యాంపు ద్వారా భారత ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో ఇండియన్ ఆర్మీ ఉపయోగించే అన్ని రకాల ఆయుధాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆయుధాలతో ఫైరింగ్, వాటి ఉపయోగాలు, శత్రు శిబిరాల టార్గెట్ తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని తెలిపారు. పదిరోజుల పాటు జరిగే ఈక్యాంపు చాలా కఠోరమైనదని, ఎంతో దృఢ సంకల్పంతో శిక్షణలో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మంచి నైపుణ్యం ఉన్న కేడెట్స్‌కే ఈ అవకాశం దక్కుతుందన్నారు. క్యాంపులో ప్రతిభ కనబర్చి వరంగల్ గ్రూప్‌నకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఎంపికై న విద్యార్థులను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ కేప్టెన్ ఆఫీసర్ డాక్టర్ ఎం.సదానందం, కేడెట్స్ ఆర్.శశాంక్, అక్షయ్‌కుమార్, సీహెచ్ రాజు, విష్ణు, జి.రాము, జె.దేవేందర్, ఎం.రాజ్‌కుమార్, ఎన్.సాయికుమార్, రాహుల్, బాల జోహార్ పాల్గొన్నారు.