Skip to main content

All india Ranks: ఆలిండియా ర్యాంక్‌లో తెలుగు యువతి ప్రతిభ

All india Ranks
All india Ranks

పాయకరావుపేట: కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) నేషనల్‌ ఎలిజిబిటీ టెస్టు ఫలితాల్లో పాయకరావుపేటకు చెందిన కొసిరెడ్డి లక్ష్మీ ప్రహర్ష ఆలిండియా 127వ ర్యాంకు సాధించింది. జూలై 25, 26, 27 తేదీల్లో దేశవ్యాప్తంగా 187 నగరాల్లో 348 కేంద్రాల్లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన ఈ పరీక్షకు 2.25 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
 
10వ తరగతి అర్హతతో ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీ క్లర్క్‌ ఉద్యోగాలు.. జీతం 32వేలు: Click Here

ఈ పరీక్షలో జేఆర్‌ఎఫ్‌ అర్హత సాధిస్తే సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని రీసెర్చ్‌ సెంటర్లలో, యూనివర్సిటీల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. వర్సిటీలు, లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హులవుతారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రహర్ష ఫిట్జి ఇంటర్నేషనల్‌ ఢిల్లీలో ఫిజిక్స్‌ ఫ్యాకల్టీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

10వ తరగతి అర్హతతో Income Tax Department లో అటెండర్‌, క్లర్క్‌ ఉద్యోగాలు నెలకు జీతం 40వేలు: Click Here

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి ఫిజిక్స్‌ విభాగంలో ఐఐటీ, ఎన్‌ఐటీ లేదా సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి రీసెర్చ్‌ చేసి డాక్టరేట్‌ తీసుకుని ప్రొఫెసర్‌గా స్థిరపడాలని తన ధ్వేయంగా పేర్కొన్నారు. ఆమె తండ్రి డాక్టర్‌ కోసిరెడ్డి వీర్రాజు విజయవాడలోని ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.శేషారెడ్డి, సెక్రటరీ డాక్టర్‌ సుగుణారెడ్డి, అకడమిక్‌ డైరెక్టర్‌ బి.వి.ఈ.ఎల్‌. నాయుడు అభినందనలు తెలియజేశారు.

Published date : 16 Oct 2024 07:55PM

Photo Stories