Skip to main content

Kakatiya University: కేయూ పీహెచ్‌డీ ప్రవేశాల ఇంటర్వ్యూలు వాయిదా

Kakatiya University PhD admission interview postponed

కేయూ క్యాంపస్‌: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వం రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించిన నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో జులై 20వ (నేటి నుంచి) తేదీ నుంచి ప్రారంభం కానున్న వివిధ విభాగాల్లోని పీహెచ్‌డీ రెండో కేటగిరీ ప్రవేశాల ఇంటర్వ్యూలను నిరవధికంగా వాయిదా వేసినట్లు కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య శ్రీనివాసరావు తెలిపారు. ఇంటర్వ్యూలను తిరిగి ఎప్పుడు నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు బుధవారం క్యాంపస్‌లోని పరిపాలనాభవనంలో వీసీ ఆచార్య తాటికొండ రమేశ్‌ అధ్యక్షతన నిర్వహించిన డీన్లు, విభాగాధిపతుల, పాఠ్య ప్రణాళిక అధ్యక్షులు, ఇతర అధికారులతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో పీహెచ్‌డీ ప్రవేశాల ఇంటర్వ్యూలు వాయిదా వేస్తున్నట్లు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని, మరిన్ని వివరాలు విశ్వవిద్యాలయ వెబ్‌ సైట్‌లో చూడాలని శ్రీనివాసరావు వెల్లడించారు.

Admission in Dravidian University: పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Published date : 20 Jul 2023 06:07PM

Photo Stories