Skip to main content

SCERT: డిప్యుటేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

Opportunity for HMs and School Assistants to work in SCERT    Online applications invitation from eligible HMs and school assistants for deputation in SCERT, Hyderabad  Invitation of applications for deputation   Hanumakonda DEO Md. Abdulhai announces deputation opportunity at SCERT, Hyderabad

విద్యారణ్యపురి: హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీలో డిప్యుటేషన్‌పై పనిచేసేందుకు ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హతగల హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ డీఈఓ ఎండీ.అబ్దుల్‌హై ఒక ప్రకటనలో తెలిపారు. కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగిన, వయసు 2024 మార్చి 1 నాటికి 58 ఏళ్లు పూర్తికాని హెచ్‌ఎంలు లేదా స్కూల్‌ అసిస్టెంట్లు అర్హులని పేర్కొన్నారు. పీజీ కోర్సులకు సంబంధించిన సబ్జెక్టులో ఎంఈడీలో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఈ సబ్జెక్టుల్లో అర్హులు ఈనెల 17 వరకు దరఖాస్తు సమర్పించవచ్చన్నారు. పోస్టుల వేకెన్సీ ఇలా.. సైకాలజీ, ఫిలా సఫీ, సోషియాలజీ, హిందీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఒకటి చొప్పున, ఉర్దూ 2, మ్యాథమెటిక్స్‌, ఫిజికల్‌సైన్స్‌, బయాలజికల్‌సైన్స్‌, సోషల్‌స్టడీస్‌, తెలుగు, ఇంగ్లిష్‌ మూడు చొప్పున, ఐసీటీ 5 ఉన్నాయి. పూర్తి వివరాలకు https://schooledu.telangana.gov.in/ISMS చూడాలని, ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చుని వివరించారు.

Published date : 13 Feb 2024 09:29AM

Photo Stories