Skip to main content

Computer Science Courses : విద్యార్థుల డిమాండ్‌తో కళాశాల‌ల్లో కంప్యూట‌ర్ సైన్స్ కోర్సులు పెంపు..

Increase of seats in computer science related courses on students demand

క‌ర్నూల్‌: విద్యార్థుల డిమాండ్‌ నేపథ్యంలో కళాశాలలు సైతం కంప్యూటర్‌ సైన్స్‌, సంబంధిత కోర్సుల్లో సీట్లను పెంచుకోవడానికే మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో మెకానికల్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ సీట్లు తమకు వద్దని జేఎన్‌టీయూకి విన్నవించాయి. సివిల్‌, మెకానికల్‌ సీట్ల స్థానంలో ఏఐ, ఐవోటీ, డేటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ సంబంధిత సీట్లను పెంచాలని కోరుతున్నాయి.

Mega Job Mela : రేపు డిగ్రీ క‌ళాశాల‌లో మెగా జాబ్ మేళా..

రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ యూనివర్సిటీల క్యాంపస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలతో పాటు ఒకటి, రెండు ప్రముఖ ప్రైవేటు కళాశాలల్లోనే సివిల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ సీట్లు ఓ మాదిరిగా భర్తీ అవుతున్నాయి. ఇవి మినహా అన్ని ప్రైవేటు కళాశాలల్లోనూ, కొత్త ప్రభుత్వ యూనివర్సిటీల్లోనూ ఈ రెండు బ్రాంచ్‌ల్లో సీట్లు భర్తీ కాని పరిస్థితి.

Published date : 17 Sep 2024 12:52PM

Photo Stories