Breaking News: ICSE, ISC పరీక్షలు వాయిదా..మళ్లీ పరీక్షలు ఎప్పుడంటే..?
కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పరీక్షలను వాయిదా వేయాలని CISCE నిర్ణయించిందని బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ & సెక్రటరీ గెర్రీ అరథూన్ తెలిపారు.ఐసీఎస్ఈ సెమిస్టర్-1 పరీక్షలు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 6వరకు.. అలాగే ఐఎస్‌సీ పరీక్షలు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 16 వరకు షెడ్యూల్ చేశారు.త్వరలోనే పరీక్షల తేదీలను ప్రకటిస్తామని తెలిపారు.దేశంలోని COVID-19 పరిస్థితిని బట్టి మొదటి సెమిస్టర్ పరీక్షలు ఆన్‌లైన్‌లో ఉంటాయని..అలాగే రెండవ సెమిస్టర్ పరీక్షలు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉంటాయని సీఐఎస్‌సీఈ ఇంతకు ముందే తెలిపిన విషయం తెలిసిందే..
ప్రతి సెమిస్టర్ పరీక్షకు ఐసీఎస్ఈ కి 80/100 మార్కులు, ఐఎస్‌సీ కి 70/80 మార్కులు ఉంటాయి. అయితే.. ఫలితాల గణన కోసం చివరకు ఉపయోగించాల్సిన మార్కుల వెయిటేజీని సగానికి తగ్గిస్తుందని బోర్డు తెలిపింది. కోవిడ్ -19 కారణంగా ఏర్పడిన విద్యాపరమైన అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని బోర్డు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్‌లను తగ్గించింది.