Skip to main content

Holidays In September Month: విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సెప్టెంబర్‌లో వరుసగా సెలవులు, మొత్తం ఎన్ని రోజులంటే

Holidays In September Month List of Important Days in September 2024

విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌. సెప్టెంబర్‌లో నెలలో వరుసగా సెలవులు వస్తున్నాయి. నెల ప్రారంభమే ఆదివారం కాగా, భారీ వర్షాల కారణంగా నేడు(సెప్టెంబర్‌2) విద్యాసంస్థలకు సెలవుదినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వర్షాలు ఇలాగే కొనసాగితే రేపు(మంగళవారం)కూడా సెలవు ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే ఈనెలలో పండగలు, రెండు, నాలుగో శనివారాలతో మరికొన్ని అదనపు సెలవులు వస్తున్నాయి. దీంతో మొత్తంగా సెప్టెంబర్‌ నెలలో దాదాపు 8-10 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. 

సెప్టెంబర్‌ నెలలో ముఖ్యమైన పండుగ వినాయక చవితి. ఈసారి గణేష్‌ చతుర్థి సెప్టెంబర్‌ 7న అంటే శనివారం నాడు వస్తుంది. దీంతో ఆరోజు విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ఉంటుంది. అలాగే మరుసటి రోజు ఆదివారం. దాంతో.. వరుసగా రెండు రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. 

Dipali Goenka Success Story: 18 ఏళ్లకే పెళ్లి.. నేడు రూ.18566 కోట్ల కంపెనీకి బాస్.. ఎవరీ దీపాలి?

సెప్టెంబర్‌లో వస్తున్న మరో పండుగ మిలాద్-ఉన్-నబీ. ఇది సెప్టెంబర్‌ 16న వస్తుంది. దీంతో ప్రభుత్వ సెలవు. ఈ పండగకి ముందురోజు సెప్టెంబర్‌ 15 ఆదివారం. అంతకుముందు సెప్టెంబర్‌ 14న రెండో శనివారం వచ్చింది. ఇలా సెప్టెంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో ఈ మూడు రోజులు స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు, బ్యాంకులకు సెలవులు ఉంటాయి. 

Training In Software Courses: సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో ఆన్‌లైన్‌ శిక్షణకు దరఖాస్తులు

ఇక హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం సందర్భంగా సెలవు ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఈసారి సెప్టెంబర్‌ 17న వినాయక నిమజ్జనం రానుంది. దీంతో ఆరోజు కూడా సెలవు ఉండనుంది. అలా చూసుకుంటే వరుసగా 14 నుంచి 17 వరకు నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఇక సెప్టెంబర్‌ నెల చివర్లో కూడా మూడు సెలవులు ఉండనున్నాయి. సెప్టెంబర్‌ 22న ఆదివారం, ఆ తర్వాత వారం సెప్టెంబర్‌ 28న నాలుగో శనివారం కారణంగా సెలవు, 29న ఆదివారం.. ఇలా వరుస పెట్టి సెప్టెంబర్‌లో సెలవులు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు తెగ ఖుష్‌ అవుతున్నారు.


సెప్టెంబర్‌లో సెలవుల జాబితా ఇదే

  • సెప్టెంబర్ 1 -ఆదివారం  సెలవు
  • సెప్టెంబర్ 7 -శనివారం వినాయక చవితి హాలిడే. 
  • సెప్టెంబర్ 8 -ఆదివారం 
  • సెప్టెంబర్ 15 -ఆదివారం సెలవు
  • సెప్టెంబర్ 16 -మీలాద్ ఉన్ నబి పబ్లిక్ హాలిడే. స్కూల్స్‌కు సెలవు
  • సెప్టెంబర్‌ 17- వినాయక నిమజ్జనం(హైదరాబాద్‌లో స్కూళ్లకు సెలవు)
  • సెప్టెంబర్ 22 -ఆదివారం 
  • సెప్టెంబర్ 28 -నాలుగో శనివారం కొన్ని స్కూళ్లకు సెలవు
  • సెప్టెంబర్ 29-  ఆదివారం
Published date : 02 Sep 2024 04:01PM

Photo Stories