SkillHub: స్కిల్‌హబ్ ద్వారా నిరుద్యోగులకు శిక్షణ
దీనిలో భాగంగా పట్టణంలో ఏర్పాటుచేసిన ఉచిత టైలరింగ్ ఎన్‌సీసీ సెంటర్ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ రోజుల్లో మహిళలు ఉద్యోగ రంగంలోనే కాకుండా స్వయం ఉపాధి రంగంలో కుడా బాగా రాణిస్తున్నారని అన్నారు. ఉచిత టైలరింగ్ శిక్షణలో అందరూ క్రమశిక్షణతో నేర్చుకొని స్వయం ఉపాధి రంగంలో మంచి విజయాలు సాధించాలని కోరారు. డీఆర్‌డీఏ పీడీ బి.బాలునాయక్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జి.వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి కే.సంజీవరావు, నాక్ అదనపు డైరెక్టర్ నరసింహారావు పాల్గొన్నారు.
బాలల హక్కులు పరిరక్షించాల్సిందే
నరసరావుపేట: బాలల హక్కుల పరిరక్షణ కోసం ఆయా ప్రభుత్వ శాఖలు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాల్సిందేనని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో ‘బేటీ బచావో – బేటీ పడావో‘ అనే కార్యక్రమం జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ‘బేటి బచావో– బేటీ పడావో‘ అనుసంధానమై ఉన్న మహిళలతో వివిధ రకాల పథకాల గురించి వివరించారు. సమాజంలో ఒకరు లేదా ఇద్దరు చట్టంపై భయం లేకుండా వైవిధ్యమైన ఆలోచనలతో ఆడపిల్లపై చేసే అరాచకాలు మనం చూస్తున్నామన్నారు. ఇటువంటి సంఘటనలు మనకు మరకగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జువైనల్ జస్టిస్ యాక్ట్, బాల్యవివాహాల నిరోధక చట్టం, దిశా యాక్ట్, యాప్, పోక్సో యాక్టివ్ వంటి చట్టాలు గ్రామస్థాయిలో ప్రజలందరికీ అవగాహన కలిగించాలన్నారు. జిల్లా మహిళా సంక్షేమ శాఖ పీడీ ఉమారాణి మాట్లాడుతూ మార్చి 8వ తేదీలోగా ఐసీడీఎస్ ప్రణాళిక తయారు చేసేందుకు కలెక్టర్ అవకాశం ఇచ్చారని తెలిపారు. జువైనల్, జస్టిస్ యాక్ట్ గురించి జువైనల్ జస్టిస్ బోర్డు మెంబర్ ఎం.శ్రీనివాస్ వివరించగా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ సీహెచ్.రాజకుమారి పోక్సో చట్టం, బాలల హక్కుల చట్టం గురించి వివరించారు. డీఆర్‌డీఎ పీడీ బాలునాయక్, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి కె.సంజీవరావు, సర్వశిక్ష అభియాన్ అధికారి రేవతి, సీడీపీఓలు ఎం.అనురాధ, శ్రీలత, శ్రీవల్లి, శాంతకుమారి, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పోలీస్ డిపార్డుమెంట్ అధికారులు పాల్గొన్నారు.