Skip to main content

Free Training: నర్సింగ్‌ కోర్సుల ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Free Nursing Course Applications Open, Free Training of Nursing Courses,Chittoor and Anantapur Residents Opportunity

తిరుపతి కల్చరల్‌: ప్రభుత్వ గ్రాంట్‌ సహాయంతో తిరుపతిలో నడుపుతున్న రాస్‌ ఎన్‌ఎంయూ శిక్షణ కేంద్రంలో ఉచిత నర్సింగ్‌ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాస్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటరత్నం తెలిపారు. 2023–24 విద్యా సంవత్సరంలో రెండేళ్ల కాలపరిమితి గల ఎంపీహెచ్‌డబ్ల్యూ నర్సింగ్‌ కోర్సు శిక్షణకు ఇంటర్మీడియెట్‌ ఉత్తీరులైన మహిళా అభ్యర్థినులు అర్హులని పేర్కొన్నారు. చిత్తూరు, అనంతపురం జిల్లా వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరా రు. ఆసక్తిగల వారు అక్టోబర్ 31వ తేదీలోపు ఎస్‌.వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శి, రాస్‌, తిరుపతి చిరునామాకు దరఖాస్తులు పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 8179769449, 9494685529 ను సంప్రదించాలని ఆయన కోరారు.
 

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs: 86 పోస్టులకు 9,100 దరఖాస్తులు

Published date : 11 Oct 2023 09:17AM

Photo Stories