University of Technology: దేశంలోనే మంచి గుర్తింపు పొందిన తొలి సాంకేతిక వర్సిటీ ..
జేఎనీ్టయూహెచ్ స్వరో్ణత్సవ వేడుకలను అక్టోబర్ 3న ఆమె ప్రారంభించి లోగోను ఆవిష్కరించారు. పూర్వ విద్యార్థుల కేంద్రం కోసం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ..యాభై ఏళ్లలో ఎన్నో మైలురాళ్లు, ప్రత్యేకతలు సాధించిన ఘనత విశ్వవిద్యాలయానికి దక్కిందన్నారు. భావితరాలకు ఆస్తి పూర్వ విద్యార్థులని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కటి సాంకేతిక పరిజ్ఞానంపైనే ఆధారపడి ఉందన్నారు. సాంకేతిక విద్యతోపాటు సామాజిక బాధ్యతను సైతం భుజానికెత్తుకునే విధంగా వేడుకల్లో విద్యార్థులు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల(రాజన్నజిల్లా)లో ఇంజనీరింగ్‌లో, సుల్తాన్ పూర్ (మెదక్ జిల్లా)లో ఫార్మా స్యూటికల్ సై¯న్స్ కాలేజీల ఏర్పాటుకు విశ్వవిద్యాలయానికి అనుమ తి లభించిందని వెల్లడించారు.
ఏడాది పాటు స్వరో్ణత్సవాలు
స్వరో్ణత్సవాలను ఏడాదిపాటు నిర్వహించనున్నట్లు ఉపకులపతి ప్రొ.కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2 వరకు కార్యక్రమాలు జరుపుతామన్నారు.