Skip to main content

February School Holidays 2025: ఫిబ్రవరి నెలలో స్కూళ్లకు ఎన్నిరోజులు సెలవులంటే..

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఫిబ్రవరి నెల మొదట్లోనే సెలవులు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఫిబ్రవరి 3వ తేదీన‌ సెలవు ప్రకటించింది. తెలంగాణలోని స్కూల్స్, కాలేజీలకు ఫిబ్రవరి 3న ఐచ్చిక సెలవు (ఆప్షనల్ హాలిడే) గా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆరోజు వసంత పంచమి కావడంతో హాలీడే అనౌన్స్‌ చేశారు. ఇక శివాజీ జయంతి, గురు రవిదాస్‌ జయంతితో పాటు మహా శివరాత్రి కూడా ఈనెలలోనే ఉండనుంది. దీంతో ఈసారి ఫిబ్రవరి నెలలో భారీగానే సెలవులు ఉన్నాయి. ఈనెలలో మొత్తం ఎన్ని సెలవు రోజులున్నాయంటే..
February School Holidays 2025
February School Holidays 2025

ఫిబ్ర‌వ‌రి సెల‌వులు ఇవే..

ఫిబ్రవరి 3వ తేదీన - వసంత పంచమి (సరస్వతీ దేవిని పూజిస్తారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సెలవు ప్రకటించారు)
ఫిబ్రవరి 14వ తేదీన - షబ్‌-ఎ-బరాత్‌ (ఆప్షనల్‌ హాలీడేగా ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్లకు సెలవు దినంగా ఉంది)
ఫిబ్రవరి 19వ తేదీన - శివాజీ జయంతి (ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని  ఫిబ్రవరి 19 న జరుపుకుంటారు మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఆ రోజు పాఠశాలలకు సెలవుగా ఉండ‌నుంది)

Schools and Colleges Holidays : నేడు, రేపు స్కూళ్లు, కాలేజీల‌కు సెల‌వు..  కార‌ణం ఇదే..! | Sakshi Education

Amazon Layoffs In 2025: ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్‌ చెప్పిన అమెజాన్‌.. భారీగా ఉద్యోగుల తొలగింపు?


ఫిబ్రవరి 24వ తేదీన‌ - గురు రవిదాస్‌ జయంతి (ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి రోజున గురు రవిదాస్ జయంతిని జరుపుకుంటారు. యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో సెలవుదినం)
ఫిబ్రవరి 26వ తేదీన - మహా శివరాత్రి (స్కూళ్లు, కాలేజీలకు ఆరోజున సెలవు ఉండనుంది).

ఫిబ్ర‌వ‌రిలో సాధార‌ణ సెల‌వులు..

ఫిబ్ర‌వ‌రి3వ తేదీన ఆదివారం.
ఫిబ్ర‌వ‌రి 8వ తేదీన రెండో శ‌నివారం.
ఫిబ్ర‌వ‌రి 9, 16, 23వ తేదీలు కూడా ఆదివారం.
అంటే, ఫిబ్ర‌వ‌రిలో 5 సాధారణ సెల‌వులు రానున్నాయి.

 

ఇలా మొత్తంగా ఫిబ్రవరి నెలలో మొత్తం సెలవుల జాబితా ఇదే

 

తేదీ సెలవు 
ఫిబ్రవరి 3 శ్రీ పంచమి / వసంత పంచమి – సరస్వతి పూజ
ఫిబ్రవరి 14 షబే-బరాత్ –  ఆప్షనల్ పబ్లిక్ హాలిడే
ఫిబ్రవరి 19 శివాజీ జయంతి – ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి
ఫిబ్రవరి 24 గురు రవీదాస్ జయంతి – గురు రవీదాస్ జన్మదినం
ఫిబ్రవరి 26 మహాశివరాత్రి 
ఫిబ్రవరి 2, 9, 16, 23 ఆదివారాలు – వారాంతపు సెలవు
ఫిబ్రవరి 15 రెండో శనివారం – సెలవు

 

Published date : 31 Jan 2025 05:18PM

Photo Stories