Education News: గురువుల చేతిలోనే విద్యార్థుల భవిష్యత్తు
పిల్లలు పాఠశాలలకు హాజరుకాని రోజున వారి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. యుక్తవయసు పిల్లలపై అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి మోదీ ప్రారంభించిన పరీక్షా పే చర్చలో భాగంగా ఫిబ్రవరి 21వ తేదీ పరీక్షాపర్వ్–6.0 కార్యక్రమాన్ని కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అప్పారావు మాట్లాడుతూ పెరిగిన సాంకేతికతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ఇందులో బాలలే ఎక్కువగా బలవుతున్నారని వాపోయారు. దీనిపై విద్యార్థులు అప్రమత్తం చేయాలన్నారు.
● జాతీయ బాలల హక్కుల కమిషన్ సౌత్ కో ఆర్డినేటర్ చిట్టిబాబు మాట్లాడుతూ పరీక్షలు పండగ వంటివని, పండగకు వారం ముందే ఎలా అలంకరణతో ఉల్లాసంగా ఉంటామో పరీక్షలకు కూడా అలాగే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రధానిమోదీ రచించిన ఎగ్జామ్ వారియర్ పుస్తకంలో ‘విద్యార్థి వారియర్‌గా ఉండాలని వర్రియర్‌గా కాకూడదని’ రాసారని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పుస్తకంలోని అంశాలను వివరించారు. పుస్తకంలోని 34 సూచననలను విద్యార్థులకు తెలియజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఏపీలోని ఆరు జిల్లాల్లో పరీక్షా పే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఉత్తరాంధ్రలో విజయనగరం, విశాఖపట్నం, పాడేరు జల్లాల్లో నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
Also Read: AP 10th Class Telugu Study Material
● డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.తిరుపతి నాయుడు మాట్లాడుతూ విద్యార్థిలోని ప్రతిభ ఉపాధ్యాయునికే ముందు తెలుస్తుందన్నారు. ఆయా రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. మార్కులు ప్రధానం కాదని, అంతకన్నా ప్రవర్తన ముఖ్యమని అన్నారు.
● డీఈఓ ఎన్.ప్రేమకుమార్ మాట్లాడుతూ తరగతి గదిలో పిల్లల్ని పిలిచే పిలుపు కూడా ఆప్యాయంగా ఉండాలని, రంగు, రూపులను బట్టి నిక్ నేమ్స్ పెట్టకూడదన్నారు. విద్యార్థులను కించపరిచేలా ఉపాధ్యాయుల తీరు ఉండకూడదన్నారు. పరీక్షలు ఒత్తిడి నుంచి బయటకు రావడానికి ప్రతిరోజు చదివించాలని, మొదట్లో కష్టంగా అన్పించినా తర్వాత చదువు వారి జీవన విధానంలో భాగంగా మారిపోతుందని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ శాంతకుమార్, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.