Skip to main content

Degree Papers: కొనసాగుతున్న డిగ్రీ పేపర్ల మూల్యాంకనం

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలోని అఫిలియేషన్‌ కళాశాలల డిగ్రీ మూడో సెమిష్టర్‌ మూల్యాంకనం మరో మూడు రోజుల్లో ముగియనుందని ఎగ్జామినేషన్స్‌ డీన్‌ డాక్టర్‌ ఎస్‌.ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు.
 Examination process at Etcherla Campus.  Evaluation of ongoing degree papers    Dr. BR Ambedkar University affiliation college evaluations.

వర్సిటీ పరీక్షల నిర్వహణ కార్యాలయంలో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. మూల్యాంకనం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల, టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జీసీఎస్‌ఆర్‌ రాజాం ప్రైవేట్‌ డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం రూరల్‌ పరిధిలోని గాయత్రి డిగ్రీ కళాశాలల్లో కొనసాగుతోందని అన్నారు. త్వరలో ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

వర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుందని, మే 15 వరకు 90 రోజుల పాటు ఈ ఇంటర్న్‌షిప్‌ కొనసాగుతుందని అన్నారు. 100 మార్కులకు ఇంటర్న్‌షిప్‌ ఉంటుందని అన్నారు. ఉన్నత విద్యామండలి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు పద్ధతుల్లో సైతం ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించిందని అన్నారు. జిల్లాలో ఆఫ్‌లైన్‌లో 5444, ఆన్‌లైన్‌లో 4000 మంది ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నారని తెలిపారు.

చదవండి: Backlog Jobs: జెడ్పీలో కారుణ్య, బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ

Published date : 20 Feb 2024 03:50PM

Photo Stories