Hostel Facilities for Students : హాస్టల్ భోజనం, సౌకర్యాలపై ఏకలవ్య మోడల్ గురుకుల విద్యార్థుల ఆవేదన.. కలెక్టర్ ఆదేశాలు..
బుచ్చినాయుడుకండ్రిగ: ‘సర్..మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదు. రోజూ స్నాక్స్ కూడా ఇవ్వడం లేదు. కోడిగుడ్లు సక్రమంగా పెట్టకపోగా.. చికెన్ రెండు ముక్కలే వేస్తున్నారు. రోజూ రుచీపచీ లేని పప్పు చారు వడ్డిస్తున్నారు. స్నానానికి నీళ్లు కూడా లేవు. ఒకే గదిలో పది మందిని కుక్కేస్తున్నారు. నీళ్ల పాలు, ఉడికీ ఉడకని అన్నం పెడుతున్నారు. కూరలు రుచిగా ఉండడంలేదు. మెస్‌లో ఫ్యాన్లు కూడా తిరగవు. బాత్ రూమ్‌లు అధ్వానంగా ఉన్నాయి. న్యాప్‌కిన్స్ ఫ్యాడ్స్ ఇవ్వడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హిందీ ఉపాధ్యాయులు బోధించే పాఠాలు అర్థం గాక చదవలేకపోతున్నాం. ఈ గురుకుల పాఠశాల మాకు శాపంగా మారింది.. సర్’ అంటూ బుచ్చినాయుడుకండ్రిగ మండలం, కనమనంబేడు గ్రామంలోని ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల విద్యార్థులు కలెక్టర్ వెంకటేశ్వర్‌కు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.
Job Mela for Unemployed Youth : ఈనెల 26న ఉద్యోగ దిక్సూచి కార్యక్రమం.. ఈ కళాశాలలో జాబ్ మేళా..
ఆయన శుక్రవారం పాఠశాల, హాస్టల్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థుల నోట్ బుక్స్ పరిశీలించారు. అలాగే, మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. తాగునీటి ఆర్వో సిస్టమ్, అన్నం వండే స్టీమ్, చపాతీలు తయారు చేసే యంత్రాలను రిపేరు చేయించుకోవాలన్నారు. విద్యార్థులకు రోజువారీ మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, వారికి అర్థమయ్యో రీతిలో పాఠాలు చెప్పాలన్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Scholarship 2024: విప్రో ఉమెన్ స్కాలర్‌షిప్‌కు 92 మంది ఎంపిక, ఏడాదికి అందే నగదు మొత్తమిదే