Govt: విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం
రామభద్రపురం: విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని అభ్యసనాభివృద్ధి కార్యక్రమం స్టేట్ నోడల్ ఆఫీసర్ సైలా కల్పన, రాష్ట్ర పరిశీలకుడు ఎన్.డేవిడ్‌రాజు అన్నారు. ఈ మేరకు 6,7,8 తరగతుల విద్యార్థులకు చదవడం, రాయడంలో నైపుణ్యం పెంపొందించేందుకు ఉపాధ్యాయుల తీసుకుంటున్న ప్రత్యేక సాధన పీరియడ్స్‌ను సమర్ధవంతంగా నిర్వహించేలా పర్యవేక్షించేలా స్థానిక ఉన్నత పాఠశాలలో బొబ్బిలి డివిజన్‌లోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలకు ఇస్తున్న శిక్షణను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అనేక విద్యాసంస్కరణలు అమలు చేస్తోందన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రంలో 20 జిల్లాల్లో మాత్రమే స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులే కీలకమని, విద్యార్థుల విద్యా సామర్థ్యం మెరుగు పడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విద్యార్థులకు సక్రమంగా అందజేసి వారి అభ్యున్నతికి కృషి చేయాలని కో రారు. కార్యక్రమంలో కోర్స్ కో ఆర్డినేటర్ బ్రహ్మా జీరావు,డైట్ ప్రిన్సిపాల్ తిరుపతినాయుడు, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ నాగభూషణరావు పాల్గొన్నారు.
స్టేట్ నోడల్ ఆఫీసర్ , రాష్ట్ర పరిశీలకుడు
చదవండి: Govt Schools: డిజిటల్ పాఠాలు