Due to Heavy Rain Schools 3 Days Holidays : అత్యంత భారీ వర్షాలు.. మూడు రోజులు స్కూళ్లకు సెలవులు.. ఏపీలో కూడా..
ఆగ్నేయదిశగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఆవరించడంతో చెన్నై నగరం, పొరుగునున్న జిల్లాల్లో తుపాన్‌తో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరువల్లూరు, కాంచీపురం, చెన్నై, చెంగల్పట్టు, విల్లుపురం, కుద్దలూరు, మైలాదుతురై, నాగపట్నం, తిరువరూరు, తంజావూరు, పుదుక్కొట్టై ,రామనాథపురం, తూతుకూడి జిల్లాల్లోను, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో గురువారం నుంచి మూడు రోజులపాటు వరుసగా భారీ వర్షాలు కురుస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా..
వాతావరణంలో శరవేగంగా చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా.. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనే ఎక్కువగా పడనుంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది. అంతకుముందు డిసెంబరు నాలుగో తేదీ నుంచి తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినప్పటికీ డిసెంబర్ రెండో తేదీ నుంచే భారీ వర్షాలు మొదలవుతాయని తాజాగా వెల్లడించింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ డిసెంబర్ రెండో తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా మారనుందని ఐఎండీ బుధవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది.
భారీ వర్షాలు.. ఇక్కడే ఎక్కువగా..
తుపాను ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో ఎక్కువగానూ, ఉత్తర కోస్తాలో స్వల్పంగానూ ఉండనుంది. డిసెంబర్ రెండు నుంచి ఐదో తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ రెండున తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో, మూడున తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్, అన్నమయ్య, నాలుగున తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, గుంటూరు, పల్నాడు, వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, ఎన్టీఆర్, ఐదున ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, పశ్చిమ గోదావరి, కోనసీమ, బాపట్ల, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. అయితే ఈ భారీ వర్షాలు పడే ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీలకు విద్యాశాఖ సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
తుపాను ప్రభావంతో కురిసే వర్షాలకు పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని, కోతలకు సిద్ధమైన వరి పంటలను సత్వరమే కోసుకోవాలని రైతులకు ఐఎండీ సూచించింది. మరోవైపు రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందని పేర్కొంది. డిసెంబర్ రెండున ఏర్పడబోయే తుపానుకు మిచాంగ్‌గా నామకరణం చేయనున్నారు. ఈ పేరును మయన్మార్ దేశం సూచించింది. నిబంధనల ప్రకారం తుపానుగా మారాకే దాని పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ భారీ వర్షాలు పడే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి వాతావరణ శాఖ హెచ్చరించింది.
Tags
- due to heavy rain schools 3 days holidays
- heavy rain due school holidays
- Heavy rains
- ap schools and colleges holidays 2023
- due to heavy rain schools and colleges closed
- die to heavy rain schools and colleges holidays news telugu
- tomorrow school and college holiday in tamilnadu
- school holidays
- Colleges Holidays
- school holidays
- Heavy rains
- India Meteorological Department
- Weather warning
- Sakshi Education Latest News