Skip to main content

Degree Colleges NAAC Grading: ఆంధ్రప్రదేశ్ లో ప్రతి డిగ్రీ కళాశాలా న్యాక్‌ గ్రేడింగ్‌కు వెళ్ళాలి

సాక్షి ఎడ్యుకేష‌న్ : భవిష్యత్తులో ప్రతి డిగ్రీ కళాశాలా న్యాక్‌ గ్రేడింగ్‌కు వెళ్లాల్సి ఉంటుందని ఉన్నత విద్యా శాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (ఆర్‌జేడీ) డాక్టర్‌ సి.కృష్ణ అన్నారు. ఇందుకు అనుగుణంగా డిగ్రీ కళాశాలల్లో ప్రభుత్వం అన్ని సౌకర్యాలూ కల్పించిందని చెప్పారు.
Degree Colleges NAAC Grading
Degree Colleges NAAC Grading

ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ లక్ష్యాలు సాధించాలని సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా ఆయన స్థానిక వీకేవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సోమవారం సాయంత్రం సందర్శించారు. రికార్డులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల హాజరు పరిశీలించారు. బోధన పద్ధతులు మెరుగుపరచి, జవాబుదారీతనం పెంపొందించేందుకు రూపొందించిన టీచింగ్‌ లెర్నింగ్‌ ప్రాసెస్‌ (టీఎల్‌పీ) యాప్‌ వినియోగం తదితర అంశాలపై అధ్యాపకులతో సమీక్షించారు. అనంతరం కృష్ణ విలేకర్లతో మాట్లాడారు. కొత్తపేట కళాశాల ఈ ఏడాది న్యాక్‌కు వెళ్తుందని, ఈ మేరకు గ్రేడ్‌ రావడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని కృష్ణ తెలిపారు.

Lecturers in Telangana 2023 : లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు.. అర్హ‌తలు- కావాల్సిన సర్టిఫికెట్స్‌ ఇవే..

ఉన్నత విద్యా రంగాన్ని అన్ని విధాలా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కృష్ణ చెప్పారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో జనరల్‌ సబ్జెక్టులతో పాటు డిగ్రీ లెవెల్‌ స్పెషల్‌ కోర్సులతో స్పెషలిస్టులను తయారు చేస్తున్నామని చెప్పారు. అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతోందన్నారు. ఈ నెల 29వ తేదీకి సీట్లు కేటాయించి, 31 నాటికి విద్యార్థులు జాయినయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలి పారు. ఎక్కువ మంది కంప్యూటర్‌ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.పెద్దిరాజు, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌.అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 25 Jul 2023 01:49PM

Photo Stories