Skip to main content

Degree Admissions: డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం

Degree Admissions

తిరుపతి సిటీ: 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 ప్రభుత్వ, 122 ప్రైవేటు, 3 టీటీడీ కళాశాలల్లో మొదటి దశ కౌన్సెలింగ్‌లో మెరిట్‌ విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న కళాశాల, కోర్సుల్లో అడ్మిషన్లు పొందారు.

Job Mela: ఈనెల 20న జాబ్‌మేళా.. అర్హతలు ఇవే

ఆయా కళాశాలల యాజమాన్యాలకు స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ నుంచి వచ్చిన ప్రోవిజినల్‌ అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ ప్రకారం ప్రిన్సిపాళ్లు విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. అడ్మిషన్ల నేపథ్యంలో సోమవారం తిరుపతిలోని ఎస్పీడబ్ల్యూ, ఎస్‌జీఎస్‌, ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Published date : 13 Aug 2024 03:29PM

Photo Stories